ఇస్లామాబాద్‌ ఆస్పత్రిలో ప్రమాదం..15 మంది శిశువులు మృతి!

కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ‘పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (PIMS)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డులోని నర్సరీ విభాగంలో ఉన్న ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా పేలిపోవడం (Islamabad Hospital Fire)తో భారీగా మంటలు వ్యాపించాయి.

ఈ అగ్నిప్రమాదంలో తీవ్రంగా పొగలు కమ్ముకోవడంతో పాటు మంటలు వేగంగా వ్యాపించడంతో వార్డులో ఉన్న 15 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో అక్కడ 16 మంది శిశువులు ఉండగా, సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఒక శిశువును సురక్షితంగా వెలికి తీయగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>