E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) E20 పెట్రోల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు రోజుల్లో E20 పెట్రోల్‌ను నిషేధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం అమలు చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. E20 పెట్రోల్ వినియోగం వల్ల ఇంజిన్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని E20పై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

E20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇంజిన్ల పనితీరు, మైలేజీపై ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాత వాహనాల ఇంజిన్లు, ఇంధన వ్యవస్థలపై E20 ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో E20 వినియోగంపై స్పష్టమైన సమాచారం ప్రభుత్వం, చమురు సంస్థలు మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>