కలం, వలిగొండ : సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని రామన్నపేట సీఐ రవి అన్నారు. మంగళవారం వలిగొండ (Valigonda) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ రవి మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా హిందూ, ముస్లింలు సోదరభావం, పరస్పర గౌరవంగా ఉండాలన్నారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మతపెద్దలు, ప్రజలను కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడకుండా, పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఎస్ హెచ్ఓ ఏ.శ్రీకాంత్ రెడ్డి, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

