నాటితే సరిపోదు.. బతికిస్తేనే భవిష్యత్తు: తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: మొక్కలు నాటడమే కాకుండా వాటిని బతికించినప్పుడే మన భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) అన్నారు. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కులో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవంలో సీపీ సునీల్ దత్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. పర్యావరణం సరిగ్గా లేకపోతే ప్రజలు ఎంత సంపాదించినా ఆ డబ్బునంతా ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు.

​గత 150 ఏళ్లలో లేని విధంగా పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం, కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహాలు తగ్గడం, బయ్యారం చెరువు ఎండిపోవడం వంటి సంఘటనలు భవిష్యత్ ముప్పునకు సంకేతాలని ఆందోళన వ్యక్తం చేశారు. వన మహోత్సవాల సమయంలోనే కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని కాపాడుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలని  మంత్రి (Tummala) పిలుపునిచ్చారు.

​అనంతరం ఈ పార్కును ‘స్తంభాద్రి ప్రకృతి వనం’గా నామకరణం చేసి లోగోను ఆవిష్కరించారు. దీనిని సకల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన రిక్రియేషన్ ప్రదేశంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించి, ప్రజలకు వృక్షప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : ‘బ్రాండ్‌ తెలంగాణ’కు పర్యాటకమే బలం: ఆదర్శ్ సురభి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>