క్రీడాకారిణి ప్రతిభ తక్కడపల్లి మరో సంచలన వీడియో!

కలం, వెబ్ డెస్క్: ఇంటర్నేషనల్ క్రీడాకారిణి ప్రతిభ తక్కడపల్లి (Pratibha Thakkadpally) బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు, వార్తలు వైరల్ కావడంతో ఆమె మరోసారి వీడియో విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో శ్రీనివాస్ గౌడ్ స్పోర్ట్స్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ ఈ వీడియోలో మాట్లాడారు.

2020 డిసెంబర్‌లో జరిగిన ఈ సంఘటనలో స్పోర్ట్స్ మినిస్టర్ కార్యాలయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. తనకు అనేక క్రీడా లక్ష్యాలు ఉండటం వల్లే ఆ సమయంలో మౌనంగా ఉండాల్సి వచ్చిందన్నారు. అయితే హకీంపేట స్పోర్ట్స్ విషయంలోనూ తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు.

తాను చేస్తున్న ఆరోపణలు ఎలాంటి డ్రామా కాదని, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎన్నో పతకాలను సాధించడం అంత తేలికైన విషయం కాదని ప్రతిభ స్పష్టం చేశారు. ఆ సమయంలో తనకు వాయిస్ లేకపోవడం వల్లనే సైలెంట్‌గా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజలు, మీడియా ఈ వివాదంలో ఒకే విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ ఎలాంటి సంబంధాలు లేవని, కేవలం ఓ క్రీడాకారిణిగా దేశం కోసం  ఆడటమే తన లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>