కలం, నిర్మల్ : ఎస్‌ఐఆర్ రెండో విడత ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. ఆదివారం బైంసా పట్టణంలో బీజేపీ బీఎల్‌ఏ – 2 కార్యకర్తలతో ఎస్‌ఐఆర్ పై నిర్వహించిన రెండో విడత అసెంబ్లీ కార్యశాలలో ఆయన హాజరై మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియతో బోగస్ ఓట్లకు అడ్డుకట్ట పడుతుందని, రెండో విడతలో ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవడమే ఎన్నికల సంఘం లక్ష్యమన్నారు. వలసదారులు, అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన విదేశీయుల ఓట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎస్‌ఐఆర్ రాష్ట్ర కో కన్వీనర్ సంజర్ల శ్రీనివాస్, ముధోల్ నియోజకవర్గం ఎస్‌ఐఆర్ ఇన్చార్జి పైడిపల్లి గంగాధర్, మున్సిపల్ చైర్మన్ తుమ్మొల్ల దత్తాత్రి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, రవి పాండే, అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, బీజేపీ మండల అధ్యక్షులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

