కార్మిక చట్టాలను అమలు చేయాలి: ఏఐటీయూసీ

కలం, జగిత్యాల: తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్ (ఏఐటీయూసీ), జిల్లా అధ్యక్షులు సుతారి రాములు శనివారం కోరుట్ల (Koratla) మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీడీఎంఏ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన మేమో (N0,1036113/2026/G2, DT,17-08-2026)ను అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ.. ప్రతి నెల కార్మికుల వేతనం నుండి ఈపీఎఫ్, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ (యాజమాని ఉద్యోగి) ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇన్సూరెన్స్ ఆఫీస్ కు చెల్లించాలన్నారు. ఈపీఎఫ్ వైబ్ సెట్ లో ఎటువంటి విస్మృతి లేకుండా అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పిఎఫ్ స్లిప్పులను కూడా అందజేయాలని కోరారు. మినహాయించబడిన డిఏ ఏరియాస్ మొత్తాన్ని రెగ్యులర్ కార్మికులు/ ఉద్యోగుల సంబంధిత పీఎఫ్ ఖాతాలో జమ చేయాలన్నారు. యూఎల్బిలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులందరికీ మాస్కులు, గ్లౌజులు, ఆయిల్, సోపూలు, చెప్పులు వంటి అవసరమైన భద్రత పరికరాలు, సంక్షేమ వస్తువులను మున్సిపల్ కమిషనర్లు తప్పకుండా తగిన మోతాదులో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సంవత్సరానికి 15 రోజుల సాధారణ సెలవులను (క్యాజువల్ లీవ్) కార్మికులకు అందించాలని కోరారు. అటువంటి సాధారణ సెలవులను వినియోగించుకోవడం వల్ల వేతనంలో కోత లేకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కాలానికి అనుపాతంగా అందించాలన్నారు. రొటేషన్ పద్ధతిని అనుసరించి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు వీకెండ్ సెలవులు (వారానికి ఒక రోజు), జాతీయ పండుగ సెలవులు (సంవత్సరానికి 8) అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాగుట్ల సాయి, తెడ్డు సాయిలు, బోలుమల్ల గంగారం, చిట్యాల ప్రవీణ్, తెడ్డు గంగ నరసయ్య, జంపయ్య, మారుతి, కోటేష్, శ్రీధర్ తదితర మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>