కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఏఐటీయూసీ డిమాండ్

కలం, నిర్మల్: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించగా.. విలాస్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ కార్మికులకు రూ.18,900, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లించాలని కోరారు. సెప్టెంబర్ 6, 7, 8వ తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల పోస్టర్లను సమావేశంలో ఆవిష్కరించారు. మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీనివాస చారి, ఫయాజ్, ఎస్‌.ఎన్‌.రెడ్డి, పద్మకుమారి, రాజేందర్, మధు, సతీష్, భూషణం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>