హనుమకొండ ఆర్టీసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కండక్టర్ల ఆందోళన

కలం, హనుమకొండ: వరంగల్ రీజియన్ ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధిత కాంట్రాక్ట్ కండక్టర్లు (Contract Conductors) శనివారం హనుమకొండ లోని ఆర్టీసీ (Hanumkonda RTC) రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు (Protest) దిగారు.

గత ఏడాది కాలంగా తమతో విధులు చేయించుకున్న ఆర్టీసీ అధికారులు అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ నిర్వహించిన పలు కీలక కార్యక్రమాలతో పాటు మేడారం మహాజాతర సమయంలోనూ తమ సేవలను వినియోగించుకున్నారని తెలిపారు.

ఏడాది పాటు సేవలు అందించిన తమను ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రత్యామ్నాయ అవకాశం ఇవ్వకుండా తొలగించడంతో కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. తమను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>