అదే పెద్ద కిక్ ఇస్తుంది : సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : తాము చేసిన పనిని అభిమానిస్తే అదే పెద్ద కిక్ ఇస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన ఎ.కోడూరు స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనకాపల్లి అంటే బెల్లం ఒక్కటే కాదని.. పారిశ్రామిక ప్రాంతం అని చెప్పారు.

రాబోయే రోజుల్లో అనకాపల్లి దేశంలోనే నెంబర్‌ వన్‌ అవుతుందని సీఎం దీమా వ్యక్తం చేశారు. తనకు ఎప్పుడూ సవాళ్లే ఎదురవుతాయని చెప్పిన చంద్రబాబు ఏ మంచి పని చేస్తున్నా విమర్శలే వస్తాయని తెలిపారు. డేటా సెంటర్‌ వస్తే నీళ్లు దొరకవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సెంటర్‌ అంటే ఏంటో తెలియని వాళ్లు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డేటా సెంటర్‌ ఇంకా ప్రారంభం కాకపోయినా నీళ్లు ఇంకిపోయాయని విమర్శిస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>