నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీకి భారీ నిధులు.. ఎమ్మెల్యే కీలక ప్రకటన

కలం, నాగర్‌కర్నూల్: ప్రభుత్వ విద్యపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, అందుకే విద్యా శాఖను తనవద్దె ఉంచుకొని పర్యవేక్షిస్తున్నారని నాగర్‌కర్నూల్ MLA (Nagarkurnool MLA) కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి (Kuchkulla Rajesh Reddy) తెలిపారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యు నోట్ పుస్తకాలను అందజేశారు. అలాగే మోడల్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం త్వరలో దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదివి ఇంటర్‌లో ర్యాంకులు సాధించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. తాను MLA అయ్యాక చాలాసార్లు కాలేజీకి వచ్చానని, కాలేజీ దుస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఆయన వెంటనే స్పందించి రూ. 9 కోట్లను మంజూరు చేయించారని తెలిపారు.

ఏడాదిలో కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తారని తెలిపారు. కంప్యూటర్ ల్యాబ్ కోసం రూ. 25 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆధునిక సదుపాయాలతో కళాశాల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు నోడల్ అధికారి వెంకట రమణ, మార్కెట్ చైర్మన్ రమణారావు, కాలేజ్ ప్రిన్సిపాల్ రవి ప్రకాశ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జక్కా రాజు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>