కలం, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్ (Kaaka Title Glimpse)ను విడుదల చేసింది. బాబీ కొల్లి ఈ గ్లింప్స్‌లో చిరంజీవిని స్టైలిష్‌గా, మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించారు.
సింపుల్ సత్యం అనే ఫ్యామిలీ మ్యాన్ కథగా ప్రారంభమయ్యే ఈ వీడియో, దాచిన గన్స్ బయటపడటంతో ఒక్కసారిగా పవర్ ఫుల్ మాఫియా యాక్షన్ మోడ్‌లోకి మారిపోతుంది. దీనికి తోడు సంగీత దర్శకుడు థమన్, చిరంజీవి ఐకానిక్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’ లోని ‘చికి చికి చేలం’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ప్యూర్ వింటేజ్ వైబ్స్ తెచ్చేలా రీమిక్స్ చేసి అందించారు.
పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలైన ఈ గ్లింప్స్ ప్రస్తుతం మెగా అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

