ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో రేవంత్‌.. తెలంగాణపై కీలక చర్చలు

కలం, వెబ్ డెస్క్: ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలో సీఎం తన ప్రతినిధి బృందంతో కలిసి పర్యటించారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్‌నిక్‌ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ మాయా ట్యూడర్‌, ప్రొఫెసర్‌ ఫైసల్‌ దేవ్జీ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని క్యాంపస్‌లో కలిశారు.

ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలతో పాటు పాలన, విద్య, ప్రజా విధానాలపై చర్చలు జరిగాయి. మాజీ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పలువురు అధికారులు, ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో భారత్‌కి ప్రత్యేక అనుబంధం ఉంది. మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ కూడా ఆక్స్‌ఫర్డ్‌లో విద్యాభ్యాసం చేయడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>