పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. తీర్పు రిజర్వ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు (Defection MLAs Case)పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సెప్టెంబర్ 16 కు తీర్పు రిజర్వ్ చేసింది. తమ పార్టీని వీడిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించారు.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన వీడియోలను సైతం న్యాయస్థానానికి సమర్పించారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటున్నారని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు న్యాయస్థానానికి వివరించారు.ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని జాతీయ జెండాగా చెబుతున్నారని విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో సెప్టెంబర్ 16న తీర్పును వెల్లడించనున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>