కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి, దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 158’(Mega 158) సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్‌ను మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. “ది వెయిట్ ఎండ్స్ ఆన్ ది మెగాస్టార్ స్పెషల్ డే” అంటూ దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
“ఒక కొత్త అధ్యాయం.. ఒక కొత్త శక్తి.. బ్రాండ్ న్యూ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు” అంటూ చేసిన ఈ పోస్టర్, సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా గ్రాండ్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాబీ, మెగాస్టార్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

