కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలోని రైతు వేదికలో గురువారం జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో రైతులకు పసుపు నాణ్యత (Turmeric Quality) మెరుగుదలపై ప్రత్యేక శిక్షణ (Training) కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పసుపు సాగులో నాణ్యమైన దిగుబడుల సాధన, పంట నాణ్యతను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలు, పసుపును శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. పసుపు నాణ్యతను పెంచడం ద్వారా మార్కెట్‌లో మంచి డిమాండ్‌తో పాటు రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ, బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగు వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

