కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులు (Rajampet SI Anjaneyulu) ఏసీబీ కి చిక్కాడు. రాజంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి,.. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ నిమిత్తం రాజంపేట ఎస్సైని ఆశ్రయించాడు. అయితే సదరు ఎస్సై పని చేసిపెడతానంటూ రూ.లక్ష డిమాండ్ చేశాడు. చివరికి రూ.50వేలకు ఒప్పందం కుదిరింది.. దీంతో బాధితుడు గతంలో రూ.20వేలు ముట్టజెప్పాడు. మిగతా రూ.30వేలు ఇచ్చే క్రమంలో ఏసీబీని ఆశ్రయించాడు. కామారెడ్డిలోని ఎస్సై నివాసంలో బాధితుడి నుంచి ఎస్సై రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

