కలం, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలోని వంకేశ్వరం (Vankeswaram) గ్రామంలో మద్దిమడుగు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 334లో ఉన్న 6గుంటల భూమి కబ్జాకు గురైందనీ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా గత వారం రోజుల క్రితం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వంకేశ్వరం గ్రామానికి పశువుల ఆసుపత్రి మంజూరు చేశారని తెలిపారు.
అందుకోసం ప్రభుత్వ భూమి చూపించాలని అధికారులకు ఆదేశించినట్లు గ్రామస్థులు తెలిపారు. రెవెన్యూ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో బాగంగా నిషేధిత జాబితా (22ఏ)లో ప్రభుత్వ భూమిని పెట్టి కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై పదర తాసిల్దార్ సురేష్ పోన్ లో వివరణ కోరగా ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని.. క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు తీసుకుంటామని తెలిపారు.

