సుతార్ 10 వికెట్లు.. జడేజాకు ఎర్త్ పెడతారా?

కలం, స్పోర్ట్స్​ : శ్రీలంకతో తొలి టెస్టులో మానవ్ సుతార్ (Manav Suthar) అదరగొట్టాడు. గాలే టెస్టులో ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. దీంతో జట్టులో అతడి భవిష్యత్‌పై చర్చ మొదలైంది. సుతార్‌ను రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా చూడటం మొదలైంది. అయితే మాజీ క్రికెటర్ మన్‌విందర్ బిస్లా దీనిని తప్పుబట్టారు. సుతార్ అద్భుత ప్రదర్శన చేసినంత మాత్రాన జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడని చెప్పడం సరికాదని బిస్లా అన్నారు. ఒకటి, రెండు మ్యాచ్‌ల తర్వాత ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను వెతకడం సరైన విధానం కాదని తెలిపారు.

గాలే టెస్టులో సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో తొలిసారి 10 వికెట్ల ఘనత సాధించాడు. 24 ఏళ్ల సుతార్ తన రెండో టెస్టులోనే ఈ రికార్డు అందుకున్నాడు. విదేశీ గడ్డపై 10 వికెట్లు తీసిన ఏడో భారత స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన భారత స్పిన్నర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. అయితే సుతార్‌కు జడేజాతో కలిసి ఆడటం మరింత ఉపయోగకరమని బిస్లా అభిప్రాయపడ్డారు.

జడేజాతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, అతడితో కలిసి బౌలింగ్ చేయడం సుతార్‌కు ఎంతో నేర్పుతుందని చెప్పారు. జడేజా టెస్టుల్లో 352 వికెట్లు, 4,117 పరుగులు చేశాడు. ఇలాంటి అనుభవం ఉన్న ఆటగాడిని ఒక్క మ్యాచ్ ప్రదర్శన ఆధారంగా భర్తీ చేయడం సాధ్యం కాదని బిస్లా పేర్కొన్నారు. సుతార్, జడేజా ఇద్దరూ భారత జట్టుకు విలువైన ఆటగాళ్లేనని బిస్లా అభిప్రాయపడ్డారు. సుతార్ ప్రదర్శనతో జట్టులో స్పిన్ విభాగానికి మరిన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>