కలం, కరీంనగర్: కరీంనగర్ లో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఈనెల 22న నిర్వహించనున్న ఇంటర్ ఫెయిత్ కాన్ఫరెన్స్ (Interfaith Conference)కు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు (Velchala Rajender Rao)ను మర్కజి మిలాద్ కమిటీ కరీంనగర్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ నెల 22వ తేదీ శనివారం సాయంత్రం కరీంనగర్‌లోని రాజీవ్ చౌక్ వద్ద ఉన్న పికాక్ రెస్టారెంట్‌లో “ఇంటర్ ఫెయిత్ కాన్ఫరెన్స్” నిర్వహించనున్నట్లు తెలిపారు.
మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మత సామరస్యం, సోదరభావం, శాంతి సందేశాన్ని చాటే అంశాలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా గురువారం కొత్తపల్లిలోని ప్రజా కార్యాలయంలో రాజేందర్ రావును మర్కజి మిలాద్ కమిటీ ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని రాజేందర్ రావు ను కోరారు. తప్పకుండా కాన్ఫరెన్స్ కు హాజరవుతానని రాజేందర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

