మొబైల్‌ కనెక్షన్లపై కేంద్రం కొత్త నిబంధనలు

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో సిమ్‌ల వాడకంపై కేంద్రం కొత్త నిబంధనలు (New SIM Rules) తీసుకొచ్చింది. ఒక వ్యక్తి అన్ని టెలికాం కంపెనీలు, సర్వీస్‌ ఏరియాలు కలిపి గరిష్ఠంగా 9 మొబైల్‌ కనెక్షన్లు మాత్రమే తీసుకునేలా DoT నిబంధనలు (DoT) నిబంధనలు విధించింది. జమ్మూకశ్మీర్‌, అసోం, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం గరిష్ఠ పరిమితి 6 మొబైల్‌ కనెక్షన్లు మాత్రమేనని స్పష్టం చేసింది. డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ (DIP) ద్వారా గుర్తించిన అనుమానాస్పద నంబర్లకు రీ-వెరిఫికేషన్‌ చేయాలని పేర్కొంది. పరిమితికి మించి కొత్త కనెక్షన్లు జారీ కాకుండా కఠినమైన వెరిఫికేషన్‌ ప్రక్రియ తీసుకొచ్చింది. సైబర్‌ మోసాలు, అక్రమ కార్యకలాపాలకు మొబైల్‌ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>