కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో మరో ఐకానిక్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ప్రస్తుత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. కార్యక్రమాల నిర్వహణకు ఇది ఏమాత్రం అనువుగా లేదని ఇంజినీర్లు రిపోర్ట్ ఇవ్వడంతో కొత్తగా అంబేడ్కర్ టవర్ (Ambedkar Tower) నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.108 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ జీవో ఇచ్చింది. ఈ టవర్ నిర్మాణం పూర్తయితే ఎస్సీ వర్గాల అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే వేదిక కానుంది.
పది అంతస్తులతో..
ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించబోతున్న అంబేడ్కర్ టవర్(Ambedkar Tower)లో మొత్తం పది అంతస్తులు ఉండబోతున్నాయి. కన్సెల్టెన్సీ ద్వారా ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ డిజైన్లతో పాటు ప్రతి ఫ్లోర్ ఎలా ఉండాలో డిజైన్లు ఇవ్వాలని జీవోలో పేర్కొంది. ఈ టవర్ నిర్మాణానికి ఇప్పటికే బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించారు. వీలైనంత త్వరగా ఈ టవర్ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించింది.
Also Read : ఏలేటి సవాల్.. చర్చకు రాని పొంగులేటి
Follow Us On: X(Twitter)

