నిర్మల్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఐటీఐ కళాశాలలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి (Rajiv Gandhi Jayanti) వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. యువత అభ్యున్నతికి ఆయన తీసుకున్న నిర్ణయాలు, దేశంలో కంప్యూటర్ సాంకేతిక విప్లవానికి వేసిన పునాదులను గుర్తు చేసుకున్నారు.

సద్భావనా దివస్‌ను (Sadbhavana Diwas) పురస్కరించుకుని శాంతి, సోదరభావం, మత సామరస్యం, జాతీయ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి, ఐక్యత కోసం రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ ఆమెడ శ్రీధర్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>