22-ఏపై బీఆర్ఎస్‌ది అనవసర రాద్దాంతం: మహేశ్ కుమార్

కలం, నిజామాబాద్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) లేఖపై నిజామాబాద్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. 22-ఏ భూములపై బీఆర్ఎస్ పార్టీ అనవసర రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. కింది స్థాయిలో జరిగిన తప్పిదం తమ దృష్టికి వస్తే లోపాలను సరిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారని అన్నారు. తప్పిదం జరిగిందని సాక్ష్యతు మంత్రి ప్రకటించి సరిదిద్దారని వివరించారు. 22-ఏ జాబితా వల్ల భూదందా, భూముల అన్యాక్రాంతానికి అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వంలో సామాన్యులకు అన్యాయం జరిగితే గాంధీ భవన్ తలుపులు తట్టవచ్చని చెప్పుకొచ్చారు.

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలోనూ మహేష్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. పోచారం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడామని ఆయన ఆవేదనను అర్ధం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. బాన్సువాడలో పాత కొత్త నేతల కలయికతో ముందుకు వెళ్తామని అన్నారు. పోచారం కాంగ్రెస్ సిద్ధాంతాలకు, సంక్షేమానికి మద్దతుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు 70 శాతం పదవులు ఇస్తామని తెలిపారు.

Also Read : ఏలేటి సవాల్‌.. చర్చకు రాని పొంగులేటి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>