పెద్దపల్లి రైల్వే కనెక్టివిటీ మరింత విస్తరించాలి: ఎంపీ

కలం, కరీంనగర్ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై ఎంపీలతో కలిసి రైల్వే జనరల్ మేనేజర్‌తో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన రైల్వే సమస్యలు, పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రయాణికుల అవసరాలు, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ ప్రత్యేకంగా చర్చించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మరిన్ని రైళ్లు కేటాయించడం, ముఖ్యమైన రైళ్లకు అదనపు స్టాపేజీలు కల్పించడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంవంటి కీలక అంశాలను జీఎం దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు.

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల రాకపోకలకు అనుగుణంగా రైల్వే సేవలను మెరుగుపరచడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర రైల్వే శాఖ స్థాయిలో నిరంతరం కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులను కోరారు. ఎంపీ ప్రస్తావించిన అంశాలపై రైల్వే ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలువురు ఎంపీలు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>