కేరళకు పవన్ కళ్యాణ్.. 20 రోజులు అక్కడే!

కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ (Pawan Kalyan) రేపు కేరళ పర్యటనకు వెళ్తున్నారు. సుమారు 20 రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్ కళ్యాణ్.. కేరళలోని ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రానికి వెళ్లనున్నారు. అక్కడ చికిత్స తీసుకున్న తరవాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

ఇటీవల కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్​‌ను అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తీవ్ర జ్వరంతో రాజమండ్రి ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే నిపుణుల సూచనల మేరకు ఆయన కేరళ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>