నిరుద్యోగ సమస్యలపై వలిగొండలో సీపీఎం ధర్నా

కలం, వలిగొండ: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ (Valigonda) మండల సీపీఎం నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు వమ్ము చేసిందన్నారు. సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఆధ్వర్యంలో పలువురు నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. యూత్ డిక్లరేషన్ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ దశరథ నాయక్‌కు వినతి పత్రం అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>