రోగులకు సరిపడా మందులు: యాదాద్రి అదనపు కలెక్టర్

కలం, వలిగొండ: రోగులకు సరిపడా మందులు ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు సూచించారు. వలిగొండ (Valigonda) మండలంలో పర్యటించిన ఆయన వేములకొండ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించి, ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలు, నమోదవుతున్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మందులు స్టాక్ తెప్పించుకోవాలన్నారు.

అర్రూర్ గ్రామంలో పంచాయతీ హాజరు రిజిస్టర్లను పరిశీలించి, పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం గురించి అదనపు కలెక్టర్ ఆరా తీశారు. వర్షపు నీటి నిల్వ కోసం అనువైన ప్రదేశాల గుర్తింపు, వాటి నిర్మాణానికి సంబంధించిన పురోగతిని సమీక్షించారు. ఎంపీడీవో జలంధర్ రెడ్డి ఎంపీవో ప్రేమలత, ఏపీఓ పరశురాములు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>