కలం, అల్లంపూర్ : అల్లంపూర్ నియోజకవర్గంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్‌కుమార్ (Sampath Kumar) బుధవారం పాదయాత్ర చేపట్టారు. శాంతినగర్‌లోని ఈశ్వరమ్మ ఆలయం నుంచి ఆర్డీఎస్ కాలువ వరకు 10 కిలోమీటర్లు ఆయన పాదయాత్రగా బయలుదేరారు.
ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు, కాలువలు నీటితో నిండి పంటలు పుష్కలంగా పండాలని, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని భగవంతుడిని ప్రార్థించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంపత్‌కుమార్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు.

