మెదక్ జిల్లాలో ఇక కోతులు ఉండొద్దు!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో కోతుల బెడద నెలకొంది. జిల్లావ్యాప్తంగా అనేక మండలాల్లో కోతుల సంచారం పెరిగిపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కోతులకు చెక్ పెట్టేందుకు కలెక్టర్ ప్రతిమా సింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెదక్ జిల్లాలో కోతుల బెడదపై బుధవారం కలెక్టరేట్‌లో డీఎఫ్ఓ జోజి, డీపీఓ యాదయ్య, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్స్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోతుల నివారణను దశలవారీగా అమలుచేయాలని, తద్వారా కోతుల నియంత్రణ జిల్లాగా మెదక్ జిల్లా అని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

ప్రజావాణిలో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చడంతో అనేక సార్లు, రైతులు, ప్రజల నుంచి పంటలను ధ్వంసం చేస్తున్నాయని, ఇండ్లలో దూరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. కోతుల బెడద లేకుండా ప్రత్యేక కార్యాచరణతో పని చేయాలని సూచించారు. కోతులను పట్టడానికి, వాటిని తరలించడానికి అవసరమయ్యే నిధులపై, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారాలు ఉంటాయన్నారు.

కోతులను పట్టిన వెంటనే స్థానిక అటవీ అధికారుల ఎఫ్ఆర్ఓ సహకారంతో నిర్మల్ జిల్లాకు తరలించాలన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతి ద్వారా వాటిని అక్కడే విడిచి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>