సర్కార్ కీలక నిర్ణయం.. జూడాల ఉపకారవేతనం పెంపు

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని జూనియర్ డాక్టర్ల (AP Junior Doctors) ఉపకారవేతనం 5 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 శాతం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేయగా.. ప్రభుత్వం 5 శాతం పెంచేందుకు అంగీకారం తెలిపింది. 2026 జనవరి 1నుంచి ఇంటర్నీలకు 5 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత ఏటా జూడాల స్టైపెండ్ 3 శాతం పెంచేందుకు నిర్ణయించింది. పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ఏటా 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిరసన చేస్తున్న జూనియర్ డాక్టర్లు తక్షణం విధుల్లో చేరాలని జూడాలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

కాగా, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అత్యవసర సేవలు మినహా మిగితా సేవలను నిలిపివేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం సంబంధిత అధికారులతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>