కలం, కరీంనగర్: మానకొండూరు (Manakondur) బాలుర ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై “నశా ముక్త్ భారత్ అభియాన్” ప్రోగ్రాంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
మాదక ద్రవ్యాల నిర్మూలన కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని మిషన్ వాత్సల్య అధికారి సాదినేని రమేష్ పేర్కొన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ రమేష్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

