కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అప్‌కమింగ్ యంగ్ హీరోలు సందడి చేస్తున్నప్పటికీ, నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీపై అనేక సందేహాలు నెలకొన్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీపై టాలీవుడ్ సర్కిల్‌లో ఏదో ఒక వార్త వినిపిస్తున్నప్పటికీ, ఏదీ ఫైనల్ కాలేదు. అయితే ఎంతోకాలంగా వేచిచూస్తున్న నందమూరి అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ లాంటింది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ తెరకెక్కనున్నట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ సిద్ధమైనట్లు, ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
రాబోయే దసరా సందర్భంగా మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ గాయానికి చికిత్స, శస్త్రచికిత్స కారణంగా సినిమా అధికారిక ప్రకటన ఆలస్యమైనట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

