సీఎం విజ‌య్ బాట‌లో క‌విత‌.. కీల‌క వ్య‌క్తితో భేటీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖ జ్యోతిష్యుడు రికీ రాధ‌న్ పండిట్ వెట్రివేల్‌ (Radhan Pandit Vettrivel)తో భేటీ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. వెట్రివేల్ త‌మిళ‌నాడు సీఎం విజ‌య్‌కి అత్యంత స‌న్నిహితుడు. ఆయ‌న‌ ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో విజ‌య్ గెలుపులో కీల‌క పాత్ర పోషించార‌ని అక్క‌డి రాజ‌కీయ వ‌ర్గాల్లో భావిస్తుంటారు. బుధ‌వారం ఉద‌యం ఆయ‌న హైద‌రాబాద్‌లో క‌విత నివాసంలో ఆమెతో పాటు కుటుంబ‌స‌భ్యుల్ని క‌లిశారు.

ప్రస్తుతం రాజకీయంగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో వెట్రివేల్‌తో క‌విత భేటీ కావ‌డం ప్రాధాన్యం సంతరించుకుంది. జ్యోతిష్యులతో భేటీ వెనుక కార‌ణం ఏమై ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. భవిష్యత్తులో ఆమె రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇటీవ‌ల త‌మిళ‌నాడులో సీఎం విజ‌య్ ప‌థ‌కాల‌పై క‌విత ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ‌లో అమ్మ పాల‌న అందిస్తాన‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక సీఎం విజ‌య్ వ్య‌క్తిగ‌త జ్యోతిష్కుడిని క‌లిసి క‌విత ఏం చ‌ర్చించారు, ఆయ‌న క‌విత‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు గురించి ఏవైనా స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>