‘పెద్ది’ విగ్రహం కూల్చివేత ఎఫెక్ట్‌.. నర్సంపేట పోలీస్‌ శాఖలో ప్రక్షాళన..!

కలం, వరంగల్‌ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు ఘటన నర్సంపేట (Narsampet) లోనే కాకుండా పోలీస్‌ శాఖలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. విగ్రహ కూల్చివేత ఘటన అనంతరం చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో పోలీస్‌ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నర్సంపేట రూరల్‌ సీఐ సాయిరమణను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

సాయిరమణ స్థానంలో జే. శంకర్‌రావును నర్సంపేట రూరల్‌ సీఐగా బదిలీ చేశారు. ఇదే సమయంలో నెక్కొండ సీఐ శ్రీనివాస్‌ను కూడా బదిలీ చేస్తూ.. ఆయన స్థానంలో కే. ఫణిధర్‌ను సీఐగా నియమించారు. వరుస బదిలీలతో నర్సంపేట, నెక్కొండ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అధికారుల మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>