సుతార్ సూపర్ షో.. గాలెలో భారత్ గెలుపు

కలం, స్పోర్ట్స్ : శ్రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టులో (Galle Test)  భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) చరిత్ర సృష్టించాడు. 24 ఏళ్ల 16 రోజుల వయసులో విదేశీ టెస్టులో 10 వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడైన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు సాధించాడు. ఈ ఘనతతో విదేశీ టెస్టులో 10 వికెట్లు తీసిన ఏడో భారత స్పిన్నర్‌గా సుతార్ నిలిచాడు. 28 ఏళ్లలోపే ఈ రికార్డు సాధించిన ఏకైక భారత స్పిన్నర్‌గా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తొలి రెండు టెస్టుల్లోనే రెండు, ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు.

తొలి రెండు టెస్టుల్లోనే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా సుతార్ (Manav Suthar) నిలిచాడు. శ్రీలంకపై ఈ ఘనత సాధించిన భారత బౌలర్లలోనూ అతను నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సుతార్ అద్భుత బౌలింగ్‌తో భారత్ గాలె టెస్టులో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 12 పాయింట్లు లభించాయి. భారత్‌కు ఇది 600వ టెస్టు కావడం విశేషం. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సుతార్‌ను ప్రశంసించాడు. అతను ఎంతో ప్రతిభావంతుడిగా కనిపిస్తున్నాడని, భారత్ తరఫున చాలా కాలం ఆడగలడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. విజయం అనంతరం యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్ సహా పలువురు సహచరులు అతడిని అభినందించారు. సుతార్ మ్యాచ్ బంతిని అందుకుని కెమెరాలకు చూపించాడు.

మరోవైపు దేవదత్ పడిక్కల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిలకడగా బ్యాటింగ్ చేసి భారత్‌కు మరో సానుకూల అంశంగా నిలిచాడు. శ్రీలంక తరఫున కేశర నువంత, సోనల్ దినుషా ఆకట్టుకున్నారు. దినుషా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. భారత్‌పై టెస్టు విజయం కోసం శ్రీలంక నిరీక్షణ కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 11 టెస్టుల్లో శ్రీలంక ఒక్కసారి కూడా గెలవలేదు. ఇందులో తొమ్మిది మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. సిరీస్‌లో రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది.

Also Read : సౌతాఫ్రికాకు చుక్కలు.. 6-0తో భారత్ ఘన విజయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>