కలం, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agerwal) నేడు హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో గతంలో నిధి అగర్వాల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. విచాణలో భాగంగా ఆమె బుధవారం ఉదయం ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు విషయాలు రాబట్టేందుకు అధికారులు ఆమెను విచారిస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో చాలా మంది సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇందులో సినిమా నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కూడా ఉన్నారు. ఈ కేసులో పలువురు సెలబ్రెటీలను ఇప్పటికే అధికారులు విచారించారు. అయితే విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. చాలా రోజుల తర్వాత ఈ కేసులో విచారణ ప్రారంభం కావడంతో ఎలాంటి విషయాలు బయటపడతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.

