గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల (AP MLC) నియామకం జరిగింది. వర్ల రామయ్య, రమాదేవిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఇరువురి నియామకానికి సంబంధించిన అధికారికి ప్రక్రియ పూర్తయింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన వర్ల రామయ్య, రమాదేవి పదవీకాలం ఆరేళ్లుగా ఉంటుంది.

కాగా, ఇంతకుముందు వీరి స్థానంలో డిప్యూటీ చైర్ పర్సన్ జాకియా ఖానమ్‌, వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఉండేవారు. అయితే వారి పదవీకాలం పూర్తి కావడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన ఆ రెండు స్థానాలను ఏళ్ల తరబడి టీడీపీ పార్టీకి సేవలు అందిస్తున్న వర్ల రామయ్య, రమాదేవీలకు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>