ఎన్టీఆర్‌ ఇంట్లో విషాదం.. ‘భగీర’కి భావోద్వేగ వీడ్కోలు!

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మనోవేదనకు గురయ్యారు. గత నాలుగేళ్లుగా తన కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన ప్రియమైన పెంపుడు కుక్క ‘భగీర’ (Bhageera) తుదిశ్వాస విడిచింది. తన ప్రాణస్నేహితుడిని కోల్పోవడంతో ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. భగీరతో కలిసి ఉన్న పిక్చర్స్ ను, దానికి అంతిమ వీడ్కోలు పలికిన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఒక భావోద్వేగమైన సందేశాన్ని రాసుకొచ్చారు.

నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగుపెట్టి, చాలా తక్కువ సమయంలోనే మా కుటుంబంలో ఒక ముఖ్యమైన సభ్యుడిగా మారిపోయావంటూ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. ఎంతో ప్రేమ, విశ్వాసం, అల్లరితో పాటు మరెవరూ ఇవ్వలేని ఒకరకమైన ఓదార్పును అందించినందుకు భగీరకు ధన్యవాదాలు తెలిపారు. భగీర లేని లోటు ఇంట్లో చాలా పెద్ద శూన్యాన్ని మిగిల్చిందని, తన జీవితాన్ని నాలుగేళ్ల పాటు ఎంతో అందంగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘మిస్ యు మై లిటిల్ వన్, నీపై ప్రేమ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది’ అని ఎన్టీఆర్ కన్నీటి వీడ్కోలు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>