కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) శివారు రాజుపేట వద్ద 365వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు రోడ్డుపై ఉన్న ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గురైన వారు గూడూరు మండలం బొద్దుగొండ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

