కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రి తనిఖీ.. వైద్యంపై ఎంపీ రఘురాం రెడ్డి ఆరా!

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఖమ్మం ఎంపీ  రామసహాయం రఘురాం రెడ్డి (Khammam MP) మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐసీయూ, జనరల్ వార్డులను స్వయంగా పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ​

మందుల నిల్వల వివరాలను ఎంపీ ప్రశ్నించగా, తాను ఇటీవల బదిలీపై వచ్చానని అక్కడ ఉన్న ఓ మహిళా వైద్యురాలు తెలిపారు. ఆస్పత్రిలో మందుల కొరత ఉందంటూ ఫిర్యాదులు వస్తున్నాయని, పేద రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ ఆదేశించారు. ఈ తనిఖీ సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడం గమనార్హం.

Also Read : ‘రాబరీ మినిస్టర్‌గా’ పొంగులేటి.. ఏలేటి సంచలన ఆరోపణలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>