పుష్కర ఘాట్‌ నిర్మించండి.. పొన్కల్‌ గ్రామస్తుల విజ్ఞప్తి

కలం, నిర్మల్: మామడ మండలం పొన్కల్ (Ponkal) గ్రామంలో నూతన పుష్కర ఘాట్ నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావుకు (Kuchadi Srihari Rao) వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని గోదావరి నది తీరంలో శ్రీ నాగదేవత, హనుమాన్ ఆలయాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో పుష్కర ఘాట్ ఉండేదని, అయితే బ్యారేజీ నిర్మాణం కారణంగా ఆలయాలతో పాటు పుష్కర ఘాట్ కూడా ముంపునకు గురైందని వివరించారు.

ప్రస్తుతం బ్యారేజీ దిగువ భాగంలో శ్రీ నాగదేవత, హనుమాన్ ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అదే ప్రాంతంలో నూతన పుష్కర ఘాట్ నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. పుష్కర ఘాట్ నిర్మాణం వల్ల భక్తులకు, గ్రామ (Ponkal) ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం సంబంధిత అధికారులతో చర్చించి నూతన పుష్కర ఘాట్ నిర్మాణానికి చర్యలు చేపట్టేలా కృషి చేయాలని గ్రామస్తులు కూచాడి శ్రీహరిరావును కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్ నాయక్, నాయకులు గంగారెడ్డి, లింగన్న, లింగారెడ్డి, రఫీతో పాటు వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : ‘రాబరీ మినిస్టర్‌గా’ పొంగులేటి.. ఏలేటి సంచలన ఆరోపణలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>