జూప‌ల్లి vs కోవ ల‌క్ష్మి.. ఆసిఫాబాద్‌లో మాట‌ల యుద్ధం!

క‌లం, వెబ్‌డెస్క్‌: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాల పంపిణీ కార్య‌క్ర‌మం ర‌సాభాస‌గా మారింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ మంత్రి జూప‌ల్లి కృష్ణా రావు (Jupally Krishna Rao), బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ ల‌క్ష్మి (Kova Laxmi)కి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. నేడు జిల్లా క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో మంజూరు ప‌త్రాలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా జూప‌ల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక గ్రామ‌గ్రామాన ఇండ్లు ఇస్తున్నామ‌ని, గ‌త బీఆర్ఎస్ పాల‌న‌లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కోవ ల‌క్ష్మి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మొద‌టి విడ‌త‌లో నియోజ‌క‌వ‌ర్గానికి మంజూరు చేసిన 3500 ఇండ్ల‌కు ఎన్ని ఇండ్లు పూర్తి చేశారో స‌మాధానం చెప్పాల‌ని కోవ ల‌క్ష్మి డిమాండ్ చేశారు. అక్క‌డే ఉన్న అధికారుల‌ను వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాల‌ని అడిగారు. కానీ, ఎవ్వ‌రూ స‌మాధానం చెప్ప‌లేదు. అలాగే కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఇస్తున్న ఇండ్ల‌న్నీ కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారుల‌కే ఇస్తున్నార‌ని కోవ ల‌క్ష్మి ఆరోపించారు. బీఆర్ఎస్ హ‌యాంలో ఉన్న సంక్షేమ ప‌థ‌కాల‌న్నింటిని ర‌ద్దు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ స‌భను బ‌హిష్క‌రించి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. మ‌రోవైపు జూప‌ల్లి కృష్ణా రావు (Jupally Krishna Rao) ప్ర‌తి గ్రామంలో పేద‌ల‌కు మాత్ర‌మే ఇండ్లు ఇస్తున్నామ‌ని, అన‌ర్హుల‌కు ఇండ్లు మంజూరైతే లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Also Read : అగ్గిపెట్టె రావు పాపాల‌న్నీ తెలుసు.. హ‌రీశ్‌పై పొంగులేటి సెటైర్లు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>