గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు ఉచితంగా కరెంట్‌ సరఫరా చేయాలని కార్పొరేషన్ పాలకవర్గం నిర్ణయించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. అందుకు అయ్యే ఖర్చులనున కరీంనగర్ కార్పొరేషన్ చెల్లిస్తుందని ప్రకటించారు. కార్పొరేషన్ పరిధిలో ఏటా సుమారు రెండు వేల గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గత మూడేళ్లుగా ఈ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ ఛార్జీలను బండి సంజయ్ సొంతంగా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించిన నేపథ్యంలో గణేశ్ మండపాల కరెంట్ బిల్లలును కార్పొరేషన్ చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

రూ.22 వేల కోట్ల నిధులతో..

కరీంనగర్ పర్యటనలో భాగంగా మంగళవారం 21వ డివిజన్ విద్యానగర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో కోటి రూపాయలతో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రూ.22 వేల కోట్ల నిధులతో అనేక పనులు చేపట్టినట్లు తెలిపారు. అందులో రూ.5 వేల కోట్లతో జాతీయ రహదారులను నిర్మించినట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి రూ.5 లక్షల చొప్పు నిధులు ఇచ్చానని, రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో నిధులిస్తామని చెప్పారు.

100 రోజుల్లోనే ఎన్నో పనులు..

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీకి అప్పగించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు 100 రోజుల్లోనే రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులను తీసుకొచ్చినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికే స్మార్ట్ సిటీ పేరుతో రూ.940 కోట్ల నిధులు తెచ్చి కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని డెవలప్‌మెంట్ చేసినట్లు వివరించారు. వరంగల్‌కు సైతం స్మార్ట్ సిటీ నిధులొచ్చినా.. అక్కడ పనులకు నోచుకోలేదన్నారు. కార్యక్రమం అనంతరం 16వ డివిజన్ లక్ష్మీపూర్, మల్కాపూర్ కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రూ.15 లక్షలతో చేపట్టిన వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>