యూట్యూబ్‌లో సంచలన మార్పు: ఇకపై క్లిక్ చేసి ప్లే అయితే చాలు..!

కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ (YouTube) సంచలన నిర్ణయం తీసుకుంది. వీడియో వ్యూ కౌంటింగ్ లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు వీడియో కొంత సమయం చూస్తేనే వ్యూ కింద లెక్కించే పాత విధానానికి స్వస్తి పలికి, సరికొత్త రూల్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. వీడియో ప్లే అవ్వడం ప్రారంభమైన వెంటనే ఒక వ్యూగా కౌంట్ చేయనున్నట్లు తెలిపింది.

ఈ సరికొత్త రూల్ ఆగస్టు 24 నుంచి అందుబాటులోకి రానుందని యూట్యూబ్ సంస్థ తెలిపింది. వీడియోను ఎంతసేపు చూశారనే దానితో సంబంధం లేకుండా వ్యూ నమోదు అవుతుందని, రీవాచ్ చేసిన వ్యూగా లెక్కించనున్నట్లు స్పష్టం చేసింది.ఈ సరికొత్త మార్పు వల్ల ఇకపై యూట్యూబ్‌లో వీడియోలకు కనిపించే పబ్లిక్‌ వ్యూస్‌ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. యూట్యూబ్ షార్ట్స్, లాంగ్ వీడియోల రీచ్‌ను పెంచడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించనుంది.

అయితే వ్యూ కౌంటింగ్ విధానంలో మార్పులు చేసినప్పటికీ, మానిటైజేషన్ లో ఈ మార్పు ప్రభావం ఉండదని చెప్పింది. క్రియేటర్ల ఆదాయం, అర్హత లెక్కల కోసం ఎంగేజ్డ్ షార్ట్ వ్యూస్, ఎంగేజ్డ్ వాచ్ అవర్స్, క్వాలిఫైడ్ వ్యూస్ వంటి మెట్రిక్స్ నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>