కవిత సంచలన ప్రకటన.. పేదల కోసం కొత్త పథకం!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే పేదల కోసం భూ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీని కింద ప్రతి కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామన్నారు. సామాజిక న్యాయం సాధ్యం కావాలంటే భూ పంపిణీ జరగాల్సిందేనన్నారు. ప్రభుత్వం వద్ద 60 లక్షల ఎకరాల భూమి ఉందని.. భూదాన్ భూములు కూడా ఉన్నాయని, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ గురించి తాము మాట్లాడితే.. అధికారంలోకి వచ్చిన 31 నెలలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అంటోందన్నారు.

సీఎం సోదరులు.. భూ దొంగలు

తెలంగాణలో జరుగుతున్న భూ దోపిడీ గురించి దేశం మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటోందని టీఆర్ఎస్ చీఫ్​ కవిత విమర్శించారు. సీఎం రేవంత్ ఏడుగురు సోదరులు భూ దొంగలుగా మారారని, వాళ్ల రౌడీ ముఠా తెలంగాణ భూమిని దొంగతనం చేస్తోందన్నారు. పొంగులేటిని గెలిపిస్తే కొడుకు, శ్రీధర్ బాబును గెలిపిస్తే సోదరుడు, భట్టిని గెలిపిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ప్రజల మీద పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదల నుంచి 30 వేల ఎకరాలను లాక్కున్నారని ఆరోపించారు. వికారాబాద్‌లో పరిశ్రమల పేరుతో 80 శాతం అసైన్డ్ ల్యాండ్‌లను గుంజుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు ప్రాధాన్యం ఎక్కడ..?

16 మంది మంత్రుల్లో ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారని టీఆర్ఎస్ చీఫ్​ కవిత విమర్శించారు. బీసీలకు ప్రాధాన్యం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇద్దరిని సలహాదారులుగా నియమించుకున్నారని.. వీహెచ్‌కు ఇచ్చిన పదవికి తక్కువ జీతం, తక్కువ హోదా పెట్టారన్నారు. అదే శశిధర్ రెడ్డికి రూ.2.5 లక్షల జీతం, కేబినెట్ హోదా ఇస్తున్నారని విమర్శించారు. సలహాదారుల పదవుల్లో ఇంత వ్యత్యాసమా.. అని ప్రశ్నించారు. ఆర్టీఐ కమిషనర్లలో ఒక్కరు కూడా బీసీలు లేరన్నారు. గత రెండేళ్లలో బీసీలకు కేటాయించిన రూ.5.96 లక్షల కోట్ల బడ్జెట్‌లో, ఖర్చు చేసింది కేవలం రూ.5,500 మాత్రమే అన్నారు.

వారికి అడుగడుగునా అవమానమే..

మంత్రి వర్గంలో అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని టీఆర్ఎస్ చీఫ్​ కవిత విమర్శించారు. యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టి అవమానించారని, పెద్దపల్లి ఎంపీ వంశీకి కనీసం పుష్కరాల ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదన్నారు. బీసీ మంత్రులు వాకిటి, కొండా సురేఖలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. లంబాడాలు లేని మంత్రివర్గం ఇదేనన్నారు. మైనార్టీల కోసం పోరాటం చేస్తే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>