కలం, వరంగల్ : హనుమకొండ జిల్లా కాజిపేట (Kazipet) మండలం రాంపూర్ ఊరచెరువు సమీపంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు అతడిని కత్తితో తీవ్రంగా పొడిచి చంపినట్లు ఘటనా స్థలంలో ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే ధర్మసాగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని చిల్పూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య (45)గా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ వేగవంతం చేశారు.

