సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌.. అల్లు అర్జున్ విచార‌ణ‌

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసు (Sandhya Theatre Stampede Case) పై నాంప‌ల్లి కోర్టులో సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నేడు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. గతంలో కోర్టు ఆదేశాలు ఇవ్వ‌డంతో అల్లు అర్జున్ నేడు స్వ‌యంగా విచారణకు హాజరయ్యారు.

సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగగా, తదుపరి విచారణను సెప్టెంబర్‌ 1కి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>