కార్మికుల సమస్యలపై బీఎంఎస్ గళం

కలం, కరీంనగర్: కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్(Bharatiya Mazdoor Sangh) ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పప్పుల సురేష్ మాట్లాడుతూ.. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని కోరారు.

EPF-95 కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని, తెలంగాణ ప్రభుత్వం కనీస వేతనాల జీవోను సవరించి కనీస వేతనం రూ.25 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు నెలకు రూ.4 వేల జీవన భృతి కల్పించాలని, అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే EPF వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.30 వేలకు, ESI వేతన పరిమితిని రూ.21 వేల నుంచి రూ.42 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి

వీధి వ్యాపారులపై మున్సిపల్ అధికారులు చేస్తున్న వేధింపులను అరికట్టాలని బీఎంఎస్ నాయకులు కోరారు. కరీంనగర్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వీధి వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో బీఎంఎస్ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రవణ్, జిల్లా కార్యదర్శి తొర్తి శ్రీనివాస్, రేణికుంట శంకర్, నక్క అరుణ్, నోముల ప్రసాద్, విష్ణు, ఆకుల తిరుపతి, మురళి, రవి, కుమార్ శ్యామల, సునీత తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>