కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

కలం, సూర్యాపేట: సూర్యాపేట కలెక్టర్‌ (Suryapet Collector)తో పాటు ఇతర అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేసిన ఘటన సంచలనంగా మారింది. ఫోర్జరీకి పాల్పడిన కోటక్ మహీంద్రా బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా యంత్రాంగం, బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్యకు సంయుక్తంగా సూర్యాపేట కోటక్ మహీంద్రా బ్యాంకులో జాయింట్ ఖాతా ఉంది. ఈ ఖాతా లావాదేవీలకు సంబంధించి బ్యాంకు మేనేజర్‌ కోడూరు రఘు ప్రసాద్ నిధుల చెక్కులు, పత్రాలపై ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు.

కలెక్టర్ సంతకం తేడా ఉండటంతో..

సంతకాల మధ్య వ్యత్యాసాన్ని గమనించిన డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య వెంటనే విషయాన్ని కలెక్టర్ (Suryapet Collector) దృష్టికి తీసుకెళ్లారు. ఐఏఎస్ అధికారి సంతకాన్నే ఫోర్జరీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన తేజస్ నందలాల్ పవార్‌.. సదరు బ్యాంకు మేనేజర్‌పై వెంటనే క్రిమినల్ ఫిర్యాదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ నెల 16న చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు వేగంగా విచారణ జరిపి కోడూరు రఘు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో, సదరు జాయింట్ ఖాతా నుంచి ఏమైనా నిధులు పక్కదారి పట్టాయా? అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Also Read : గాంధీభవన్‌లో సామాజిక వర్గాల రగడ… క్రమ‘శిక్ష’ణలో వివక్ష!

Follow Us On: X(Twitter)

నల్గొండ వార్తల కోసం క్లిక్ చేయండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>